Hyderabadi Chicken Haleem Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ హలీం.. తప్పక ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabadi Chicken Haleem Recipe : రంజాన్ నెల ప్రారంభమైంది. ఇక హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసిన హలీం వాసన ఆకట్టుకుంటుంది. మన దేశంలో అనేక చోట్ల దొరుకుతుంది. కానీ హైదరాబాద్ హలీంకి ఉన్న రుచి, ఘాటు, నెయ్యి వాసన ఇవన్నీ ఎంతో ప్రత్యేకం. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలకు హలీం అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. సాంప్రదాయంగా మటన్‌తో చేసే దాన్నే అసలు హలీం అంటారు. చికెన్‌తో చేస్తే హరీస్ అని పేరు. కానీ ఎక్కువ మంది చికెన్ హలీం అనే పేరే వాడుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ చికెన్ హలీం ఎలా చేయాలో తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ వంటకాన్ని ఓపికతో చేయాల్సి ఉంటుంది. తొందరపడితే రుచి రాదు.
Also Read
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
చికెన్ ఉడికించడానికి కావలసిన పదార్థాలు:
ఎముకలు లేని చికెన్ – అర కిలో
నెయ్యి – నాలుగు పెద్ద చెంచాలు
జీడిపప్పు – అర కప్పు
బాదం – పావు కప్పు
పిస్తా – పది నుంచి పదిహేను
దాల్చిన చెక్క – రెండు అంగుళాలు
బిర్యానీ యాలకులు – ఒకటి
యాలకులు – నాలుగు
లవంగాలు – ఐదు
మిరియాలు – ఒక చిన్న చెంచా
కలపాసి – ఒక చిన్న చెంచా
షాహీ జీరా – ఒక చిన్న చెంచా
కబాబ్ చినీ – ఒక చిన్న చెంచా
ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు
పచ్చిమిర్చి – ఆరు
అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు చిన్న చెంచాలు
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – ఒక చిన్న చెంచా
కారం – ఒకన్నర చిన్న చెంచా
వేపిన జీలకర్ర పొడి – అర చిన్న చెంచా
మిరియాల పొడి – అర చిన్న చెంచా
పెరుగు – అర కప్పు
కొత్తిమీర, పుదీనా – కొద్దిగా
నీరు – సుమారు ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు
వేపిన జీడిపప్పు
వేపిన బాదం
వేపిన పిస్తా
పెరుగు – అర కప్పు
గోధుమ రవ్వ – మూడో వంతు కప్పు
సెనగపప్పు – ఒక పెద్ద చెంచా
కందిపప్పు – ఒక చిన్న చెంచా
ఓట్స్ లేదా బార్లీ – ఒకన్నర పెద్ద చెంచా
పెసరపప్పు – ఒక చిన్న చెంచా
బియ్యం – ఒక పెద్ద చెంచా
మినప్పప్పు – ఒక పెద్ద చెంచా
నువ్వులు – ఒక చిన్న చెంచా
నీరు – ఒక కప్పు
పాలు – పావు కప్పు
ఎండిన గులాబీ రేకులు – రెండు పెద్ద చెంచాలు
పుదీనా – పావు కప్పు
కొత్తిమీర – పావు కప్పు
గరం మసాలా – ఒకన్నర పెద్ద చెంచాలు
నెయ్యి – మూడో వంతు కప్పు
వేపిన ఉల్లిపాయలు – ఒక కప్పు
జీడిపప్పు, బాదం పేస్ట్
నానబెట్టిన పప్పుల పేస్ట్
తయారీ విధానం
మొదట అన్ని పప్పులు, ధాన్యాలు నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తగా రుబ్బాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. అదే నెయ్యిలో మసాలా దినుసులు వేసి కొద్దిసేపు వేయించాలి. ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేపాలి. అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్ వేసి మూడునిమిషాలు మంట ఎక్కువగా పెట్టి వేపాలి. తర్వాత మిగిలిన మసాలాలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసి కలపాలి. నీరు పోసి మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన చికెన్‌ను గరిటతో మెత్తగా ముద్దలా చేయాలి. ఇప్పుడు గట్టి అడుగున్న గిన్నెలో నెయ్యి వేసి పప్పుల ముద్ద, కొద్దిగా నీరు వేసి గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. ముద్దలు కాకుండా ఎప్పటికప్పుడు కలపాలి. కనీసం పదిహేను నిమిషాలు పడుతుంది. అందులో చికెన్ ముద్ద వేసి మళ్లీ కలుపుతూ ఒకటిగా చేయాలి. కొంతసేపు చిలికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేయాలి. మళ్లీ మెల్లగా కలుపుతూ ఉంచాలి. తర్వాత గరం మసాలా, నెయ్యి వేసి ఉడికించాలి. వేపిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఉంచాలి. చివరగా గులాబీ రేకులు లేదా గులాబీ నీరు, పాలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా ఇంకొంచెం నెయ్యి వేసి దించాలి. వేడిగా ఉన్న హలీం గిన్నెలో వేసి పైపైగా నెయ్యి, వేపిన జీడిపప్పు, వేపిన ఉల్లిపాయలు, నిమ్మరసం, ఉడికించిన గుడ్డు వేసి ఇస్తే.. అసలు హైదరాబాద్ రుచి ఇంట్లోనే రెడీ అయినట్టే..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!