Goa Heat Wave: హీట్ వేవ్ కారణంగా గోవాలో గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పాఠశాలలు తరగతులు నిర్వహించాయని ఒక అధికారి తెలిపారు. భారత వాతావరణ శాఖ ప్రకారం హీట్ వేవ్ మరో రోజు కొనసాగుతుందని, దీని వల్ల శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకే తరగతులను నిర్వహించనున్నామని రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ షైలేష్ సినాయ్ జింగాడే తెలిపారు.
Read Also: Elephant Smartphone: మోడ్రన్ గజరాజుకు.. స్మార్ట్ ఫోన్ కావాలంట..!
గోవాలో వాతావరణ పరిస్థితుల కారణంగా సాధారణ ఉష్ణోగ్రత కంటే 4-6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా ఉందని.. మార్చి 8, 9 తేదీల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని గోవా వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 11 నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు గోవాలో పాఠశాలలను మధ్యాహ్నం 12 గంటల వరకే నిర్వహించనున్నారు.