Chigurupati Jayaram Case: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. దాదాపు నాలుగేళ్ల పాటు విచారించిన న్యాయస్థానం ఇటీవల రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చింది. హత్య కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా రాకేష్ రెడ్డిని కోర్టు నిర్ధారించింది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Read Also: Gold Smuggling: షర్టు కింద దాచి గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా సిబ్బంది అరెస్ట్
కాగా, 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్య జరిగింది. ఈ కేసులో రాకేష్‌రెడ్డి, విశాల్, శ్రీనివాస్, రౌడీషీటర్ నగేష్ కీలక నిందితులుగా ఉన్నారు. పోలీసులు 320 పేజీల చార్జిషీట్ న్యాయస్థానంలో దాఖలు చేశారు. న్యాయస్థానానికి 48 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. జయరాం మేనకోడలు శిఖాచౌదరి, ఆమె స్నేహితుడు సంతోష్ రావును కూడా సాక్షిగా చేర్చారు. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిగింది. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.