China: ఒకప్పుడు ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. జనాభా తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం పొరుగున ఉన్న చైనా ప్రవేశపెట్టిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా ఆ దేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మళ్లీ జనాభాను పెంచేందుకు డ్రాగన్ అవస్థలు పడుతోంది. జనాభాను పెంచేందుకు చైనా కొత్త చట్టాలను రూపొందిస్తోంది. జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఒకే బిడ్డ విధానాన్ని సడలించడంతో పాటు పలు పన్ను రాయితీలను కూడా ప్రకటించింది. అయినా జనాభా పెరగకపోవడంతో తాజా మరో నిర్ణయం తీసుకుంది. పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి వరుడు సొమ్ము ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. పెళ్లి సమయంలో అబ్బాయిలు అమ్మాయిలకు కట్నం ఇవ్వడం ఇక్కడి సంప్రదాయం. వివాహ వేడుకలు ఏడాది పొడవునా జరుగుతాయి. అంతే కాకుండా పెళ్లి విషయంలో చాలా ఖర్చు అవుతుంది. దాంతో చాలా మందికి పెళ్లిళ్లు జరగడం లేదు. ఈ క్రమంలో ఈ సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.
చైనాలో వరుడికి ఉన్న ఆస్తులను వధువు కుటుంబం వద్ద ప్రదర్శించడానికి.. ఆమెను పెంచినందుకు కొంత సొమ్ము ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని అక్కడ ‘కైలీ’ అని పిలుస్తారు. ప్రస్తుతం చైనాలో జరిగే మూడొంతుల పెళ్లిళ్లలో ఈ కైలీ సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కైలీని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం యత్నించినా సరే ఫలితం లేకపోయింది. కానీ జననాల రేటు పడిపోతుండటం వల్ల మళ్లీ దీన్ని అడ్డుకట్ట వేసే చర్యలకు చైనా పూనుకుంది. జననాల రేటును పెంచేందుకు చైనాలో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. పిల్లలను కనేవారికి సబ్సిడీలు, పెళ్లిళ్లకు అదనపు సెలవులు ఇస్తున్నారు. వీటితోపాటు పెళ్లిచేసుకోని జంటలు తమ సంతానాన్ని రిజిస్టర్ చేసుకొనే అవకాశాన్ని కూడా ఇస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయని.. స్త్రీలకు ఉన్న ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు జిన్‌పింగ్ సర్కారు యత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జననాల రేటును పెంచేందుకు మరో వైపు మహిళా దినోత్సవం సందర్భంగా చైనా ప్రభుత్వం చాలాచోట్ల సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది.
Read Also: NASA-ISRO Satellite: బెంగళూరుకు చేరిన నాసా-ఇస్రో ఉపగ్రహం
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నిబంధనలను మార్చింది. ఇప్పుడు వివాహం చేసుకోకుండా పిల్లలు కన్న వారికి ప్రసూతి సెలవులు, వైద్య ఖర్చులను అందించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ సౌకర్యాలు ఇప్పటివరకు వివాహమైన జంటలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. సిచువాన్ చైనాలో 5వ అతిపెద్ద ప్రావిన్స్ కాగా.. ఇక్కడి జనాభా ఎనిమిదిన్నర మిలియన్లు. ఇటీవల ఈ సంఖ్య భారీగా తగ్గుతోంజి. తాజా నిర్ణయంతో సిచువాన్ ప్రావిన్స్ దేశంలో మిగతా ప్రాంతాల కంటే ఓ అడుగు ముందుకువేసింది.