ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆ దేశ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ముందు ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను దెబ్బతీసే ఘటనలను సహించకూడదని ప్రధాని స్పష్టం చేశారు.
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని భారత సంతతి యువకుడు చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు.
బెంగళూరులో రుతుపవనాలకు ముందు వర్షాలు వినాశనం కలిగిస్తూనే ఉన్నాయి, ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో 52 మరణాలు నమోదయ్యాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చెట్లు కూలడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోగా, పిడుగులు పడి కొందరు వర్షపు నీటిలో కొట్టుకుపోయి మరణించారు.
స్పైస్‌జెట్ సంస్థ పైలట్లకు శుభవార్త తెలిపింది. స్పైస్‌జెట్ 18వ వార్షికోత్సవం సందర్భంగా పైలట్‌ల జీతాలను నెలకు రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం మధ్య, మే 28న జరగాల్సిన వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రకటించింది. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ఈ వార్తను ధృవీకరించారు. కాగా, రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
ప్రముఖ టీవీ షో 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర వార్తను నిర్మాత జేడీ మజేథియా పంచుకున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో ఐఏఎస్ సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారంనాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.