ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి ప్రాంతంలో.. పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కాసేపట్లో రాజధాని అమరావతి ప్రాంతంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.
పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఉస్తేల వీరారెడ్డి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన... పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై స్పందించారు.
అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ప్రాణాలు తీసే వ్యక్తి అంటూ చంద్రబాబుపై భరత్ మండిపడ్డారు. రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టీడీపీ నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని ఎంపీ భరత్ వీడియోను చూపించారు.