Vaibhavi Upadhyaya: ప్రముఖ టీవీ షో ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర వార్తను నిర్మాత జేడీ మజేథియా పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌లో, ఈ దుర్ఘటన ఉత్తర భారతదేశంలో జరిగిందని తెలియజేశారు. “జీవితం చాలా అనూహ్యమైనది. చాలా మంచి నటి, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌లో ‘జాస్మిన్’గా ప్రసిద్ధి చెందిన ప్రియ స్నేహితురాలు వైభవి ఉపాధ్యాయ కన్నుమూశారు. ఉత్తరాదిలో ఆమె ప్రమాదానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను రేపు ఉదయం 11 గంటలకు ముంబైకి తీసుకువస్తారు. RIP వైభవి ,” అని జేడీ మజేథియా పోస్ట్ చేశారు. ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Sunny Leone: నన్ను చంపేస్తానని బెదిరించారు.. సన్నీ సంచలన వ్యాఖ్యలు
వైభవి 2020లో ‘ఛపాక్’, ‘తిమిర్’ (2023)లో దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మే 22న ముంబైలోని అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన కొద్ది రోజులకే వైభవి మరణ వార్త వచ్చింది.