నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ని ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ చంద్రబాబును ఏపీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.
రూ. 2వేల నోట్ల రద్దుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. రూ. 2 వేల నోట్ల రద్దు వల్ల తనకు గానీ, వైసీపీ పార్టీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైసీపీ పార్టీ పేదల పక్షమన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం ద్వారానే మేం ఎన్నికల్లో గెలుస్తాం.. డబ్బులతో కాదని ఆయన అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.
నెల్లూరు నగర వైసీపీలో విభేదాలు మరోసారి తలెత్తాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మద్దతుదారుడైన హాజీపై అనిల్ వర్గీయులు దాడి చేయడంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది.
ఏపీలో పాలిసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం 10.45 నిమిషాలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. https://polycetap.nic.in వెబ్ సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 1,43,592 మంది పరీక్షకు హాజరయ్యారు.