Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్‌గా యార్కర్ కింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా vs సౌతాఫ్రికా పోరు కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో చరిత్ర సృష్టించాడు. బుమ్రా బౌలింగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేశాడు. మూడు వికెట్లు పడగొట్టి (3/15) అద్భుత గణాంకాలతో మెరిశాడు. టీ20 వరల్డ్‌కప్‌ల చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇప్పటివరకు 22 ఇన్నింగ్స్‌లలో 33 వికెట్లు సాధించి రవిచంద్రన్ అశ్విన్ (32) రికార్డును అధిగమించాడు. అర్ష్‌దీప్ సింగ్ సైతం 18 ఇన్నింగ్స్‌లలో 32 వికెట్లు తీసి అశ్విన్‌తో సమానంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 29, రవీంద్ర జడేజా 22 వికెట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.
READ MORE: IPL 2026: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్? తలా ఫ్యాన్స్‌కు సీఎస్‌కే సీఈఓ ఇచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఇదే!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ మ్యాచ్‌లో బుమ్రా క్వింటన్ డికాక్, రియన్ రికెల్టన్, కార్బిన్ బోష్ వికెట్లు తీసి దక్షిణాఫ్రికా దూకుడుకు బ్రేక్ వేశాడు. అయినప్పటికీ.. సుపారీ జట్టు 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నరేంద్ర మోడీ లాంటి పెద్ద స్టేడియంలో ఇంత పెద్ద స్కోర్ సాధించడం టీమిండియాకు కష్టంగా మారుతోంది. అయితే.. సౌతాఫ్రికా ఆరంభంలోనే 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలోనే అయితే డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు 51 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఈజీగా 200 క్రాస్ అవుతుందని అందరూ భావించారు. కానీ చివరి ఓవర్లలో బుమ్రా (3/15), అర్ష్‌దీప్ సింగ్ (2/28) అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించింది. చివరి నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా స్కోరు కొంత తగ్గింది. అయినప్పటికీ ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్) చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాది జట్టుకు బలమైన ముగింపు ఇచ్చాడు.
READ MORE: India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!