సుప్రీంకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందుస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది.
గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వ్యవహారంపై వివాదం చెలరేగింది. తన అన్న ఆస్తి పంచడం లేదని ఆస్తిలో అన్న తనకు రావాల్సిన వాటా అన్న ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సోమవారం పుంగనూరులో చోటుచేసుకుంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ఈ నెల 27న ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్. ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని, పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
గత వారం చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన తర్వాత పౌరులు మే 23, 2023 (మంగళవారం) నుంచి రూ.2,000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడం ప్రారంభించవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది.