రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. ఎన్ని కేసులు పెట్టినా.. శిక్షలు వేసినా మార్పు రావడంలేదు.
రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ.10వేల 400కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో శ్రీ బాలాజీ ఆంకాలజీ భవనానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టామన్నారు.
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరో కీలక బాధ్యతను చేపట్టబోతున్నారు. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. కోల్‌కతాలోని గంగూలీ నివాసంలో ఆయనతో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి సమావేశమయ్యారు.
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు రూ.4.50 లక్షలకు ఆ చిన్నారి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన (యూబీటి), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), జనతాదళ్ (యునైటెడ్) సహా 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి.