Sajjala Ramakrishna Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారంనాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే నాటకాలు అంటూ ప్రచారం చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరు దఫాలు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నారని సజ్జల వెల్లడించారు. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో అనవసర కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై మండిపడ్డారు. అవినాష్ రెడ్డి విషయంలో కూడా రోత రాతలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. అవినాష్ రెడ్డి అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అవినాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Read Also: SI Suspend: మోసం చేశాడంటూ ఎస్సైపై యువతి ఫిర్యాదు.. ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు
సీఎం జగన్ పాలనను చూసి విపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రానికి మంచి జరిగితే ప్రతిపక్షాలు కడుపు మంటతో రగిలిపోతున్నాయని పేర్కొన్నారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు ఇది ఒక సమాధానమన్నారు. బీజేపీతో పార్టనర్‌గా ఉండి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. తన వ్యక్తిగత పనులకు వాడుకున్నారే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంపై ఓ మీడియా వర్గం దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. మచిలీపట్నం పోర్టు శంఖుస్థాపన కీలకమైన ప్రాజెక్టు అని.. ఇటువంటి అంశాలపై చర్చ చేయరని.. రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని భ్రమ కల్పిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు.