Road Accident: జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం లోతైన లోయలో వాహనం బోల్తా పడిన ఘటనలో కనీసం ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. వివరాల ప్రకారం, డంగుదురు పవర్ ప్రాజెక్ట్‌కు చెందిన 10 మంది కార్మికులను వాహనంలో వెళ్తుండగా.. డంగుదురు డ్యామ్ సైట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రూజర్ వాహనం లోయలో పడిపోయిందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారని ప్రమాదాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
Read Also: Nithesh Pandey: కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రమాదంపై స్పందించారు. క్షతగాత్రులకు అన్ని విధాలుగా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌లో,జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బ్రిగేడ్‌కు చెందిన అంబులెన్స్ రోడ్డుపై నుంచి జారిపడి ఒక లోయలో పడటంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఎల్‌ఓసీ సమీపంలోని కేరీ సెక్టార్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.