India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు భారత్ దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్‌లో తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. భారత్‌కు 188 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. కానీ భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్ లోకి అడుగుపెట్టింది. గత రెండు నెలల్లో ఇరు జట్లు తలపడటం ఇది ఆరోసారి. అయితే, ఈ ప్రపంచ కప్ లో వారు తలపడటం ఇదే తొలిసారి. భారత్ ఇప్పుడు బ్యాటింగ్ చేస్తోంది.
READ MORE: USA: అమెరికాలో మెరిసిన పెద్దపల్లి కళాకారుడు.. మహాభారత చిత్రంతో అదరగొట్టిన తెలుగోడు..
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
దక్షిణాఫ్రికా జట్టు తరఫున డికాక్, మార్క్రామ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా రెండో ఓవర్‌లో డికాక్(6)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అర్ష్‌దీప్ మార్క్రామ్‌ను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కేవలం 12 పరుగులకే పరిమితమైంది. అప్పటికీ.. బుమ్రా విధ్వంసం కొనసాగింది. తన రెండవ ఓవర్(ఇన్నింగ్స్‌లో నాల్గవ ఓవర్)లో ర్యాన్ రికెల్టన్(7)ను అవుట్ చేశాడు. ఆరు ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా 41-3తో నిరుత్సాహంగా కనిపించింది. వెంటనే.. డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ ఎంట్రీ ఇచ్చారు. బ్రెవిస్ కేవలం 29 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. మిల్లర్‌తో కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 13వ ఓవర్లో శివమ్ దుబే బ్రెవిస్‌ను అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యం తెరపడింది. కానీ మిల్లర్ ఊచకోత మొదలు పెట్టాడు. 35 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో, వరుణ్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీసుకోవడంతో దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత, 18వ ఓవర్లో, అర్ష్‌దీప్ జాన్సెన్‌ను అవుట్ చేశాడు. 19వ ఓవర్లో, బుమ్రా మరో వికెట్ తీసుకున్నాడు. కానీ స్టబ్స్ చివరికి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా భారత్‌కు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టగా, వరుణ్, దూబే ఒక్కో వికెట్ తీశారు. అయితే.. ఈ స్టేడియంలో ఇంత పెద్ద స్కోర్ సాధించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. సూపర్ 8లో టీమిండియాకు అగ్ని అగ్ని పరీక్ష తప్పడం లేదు!
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!