రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటనను "చిరస్మరణీయమైనది" అని అభివర్ణించారు.
కట్నం దురాశతో ఓ వరుడు చేసిన పనికి వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బంధువుల ముందు వధువు కుటుంబసభ్యుల పరువు పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరోసారి ట్రిపుల్ తలాక్ ఘటన తెరపైకి వచ్చింది. కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లయిన రెండు గంటలకే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలున్నాయి.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్-3 ప్రయోగం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పవన్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీఆర్పీలో ఉన్నప్పుడే వైఎస్సార్‌ను పంచలు ఊడదీసి కొడతానన్నారని.. అప్పుడే పవన్ రాజకీయాలకు పనికి రాడని ప్రజలు అనుకున్నారని అంబటి రాంబాబు అన్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
ఏదైనా ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయంటే ఎవరైనా ఊరికే ఉంటారా?. వెంటనే వజ్రాల కోసం వేట ప్రారంభించేస్తారు కదా. అలాంటి సంఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాల వేటను ప్రారంభించారు.
సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం భూమికి సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టిందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన్నారు. 20 ఏళ్లు భూమి సాగు చేసుకున్న వారికి ఇప్పుడు యాజమాన్య హక్కులు కల్పించామన్నారు.
వైఎస్సార్‌సీపీ పార్టీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య అని.. ఏ విషయమైనా తనతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు.