ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఓ వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు, ఆమె మీద యాసిడ్ దాడి చేశారు. ఆ తరువాత ఆమె మృతదేహం ఓ బావిలో దొరికింది. ఈ ఘటన రాజస్థాన్‌లో కరౌలీ జిల్లాలో జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత భిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముస్లిం వ్యాపారుల్ని మియాలుగా సంబోధించిన హిమంత.. వారి వల్లే రాష్ట్రంలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మధ్యంతర సహాయంగా కేంద్రం నుండి రూ. 2,000 కోట్లు కోరారు.
బాలాసోర్ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత భువనేశ్వర్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
అమెరికాలోని కెంటుకీలో ఓ వ్యక్తి తన మొక్కజొన్న పొలంలో అంతర్యుద్ధ కాలం నాటి 700 అరుదైన బంగారు డాలర్లను కనుగొన్నాడు. వాటి విలువ మిలియన్ల కొద్దీ ఉంటుందని అంచనా. కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో భూమి దున్నుతుండగా.. ఆటంకం ఏర్పడింది.
భారీ వర్షాలకు ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ఇప్పుడిప్పుడే నది ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద 207.62 మీటర్లుగా నమోదైంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలకు యమునా నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది.