ఏపీ అంటే ఆక్వా హబ్ అని.. ఏటా సగటున ఒక వ్యక్తి 8 కేజీల ఫిష్ వినియోగిస్తున్నారని ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఏపీలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందన్న ఆయన.. వినియోగం తక్కువగా ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచాలన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.
మద్యం సేవించి భార్యను నానా హింసలు పెట్టడంతో,ఆ బాధలు భరించలేక కట్టుకున్న భార్య తన భర్తను కడతేర్చిన ఘటన ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. ఈ చంద్ర మిషన్ 2019 సంవత్సరం చంద్రయాన్ 2 తదుపరి మిషన్. భారతదేశం ఈ మూడవ మిషన్‌లో, శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ 'సాఫ్ట్ ల్యాండింగ్' లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. రెండో వివాహం చేసుకున్న భర్త పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్లనే భర్త పరం చేసింది ఓ కసాయి తల్లి. తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్నకూతుళ్లనే అతని వద్దకు పంపించి పిల్లలు పుట్టేలాగా చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు.
మంత్రాలయం సమీపంలో కర్ణాటక గిలకసూగూరు క్యాంపులో దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేశారు. హత్య చేయడమే కాకుండా ఆ యువతి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జనసేన టీడీపీకి బీ టీమ్ అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు, మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైసీపీ వాళ్లు జనసేనని బీ టీం అంటుంటే.. బయటి వాళ్లు అనడం వేరు .. మనవాళ్లు అనడం వేరు అంటూ జనసేన నాయకులకు ఆయన సూచించారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు.