Searching For Diamonds: ఏదైనా ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయంటే ఎవరైనా ఊరికే ఉంటారా?. వెంటనే వజ్రాల కోసం వేట ప్రారంభించేస్తారు కదా. అలాంటి సంఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాల వేటను ప్రారంభించారు. పిడుగురాళ్ల రోడ్డు శివారు ప్రాంతమైన బసవమ్మ వాగు దగ్గర రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు.. అక్కడ రోడ్ల కోసం బెల్లంకొండ నుండి తెచ్చిన ఎర్రమట్టిని పోశారు. ఈ విషయం తెలిసిన కొందరు వజ్రాలు, రంగు రాళ్లు దొరుకుతాయేమోనని వేట మొదలుపెట్టారు. వర్షం పడితే చాలు గుంపులు, గుంపులుగా వెళ్లి రోజంతా అక్కడే ఉండి రాళ్ల కోసం కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టపక్కల ప్రాంతాల వారు.. తమ వాహనాలలో అక్కడికి వచ్చి.. ఒక్క వజ్రం దొరికినా చాలని వజ్రాల కోసం వెతుకుతున్నారు.
Also Read: Dharmana Prasada Rao: ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే చెల్లదు..
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరులోనే కోహినూర్ వజ్రం దొరికిందని స్థానికంగా ప్రచారముంది . కృష్ణా నది తీరంలో ఉండే ఈ గ్రామం ప్రస్తుతం పులిచింతల బ్యాక్ వాటర్‌లో మునిగి పోయింది. గతంలో ఈ ప్రాంతంలో వజ్రాల వేట సాగేది. తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్ళూరు వెళ్ళి కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారు. అక్కడ కూలీలను పెట్టి మరీ వజ్రాల కోసం గాలించారట.. ఆ ప్రాంతం నుంచి తెచ్చిన మట్టి కావడంతోనే ఇలా గాలిస్తున్నారు. అందులో పక్కాగా వజ్రాలు, రంగు రాళ్లు ఉంటాయని నమ్ముతున్నారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో వర్షం పడిన వెంటనే స్థానికులు ఆ మట్టిలో వజ్రాలు దొరుకుతాయన్న నమ్మకంతో వజ్రాల కోసం వెతకడం మొదలు పెట్టారు. రెండు రోజుల నుండీ ఇక్కడ వజ్రాల వేట సాగుతుంది. వజ్రాలు కాకపోయినా రంగు రాళ్ళైన దొరుకుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మొత్తం మీద బసవమ్మ వాగు వద్ద జరుగుతున్న వజ్రాల వేట గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.
Also Read: YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
అంతేకాకుండా ఆ ప్రాంతంలో వజ్రాల టెస్టింగ్ మెషీన్‌లతో బంగారు వర్తక వ్యాపారులు కూడా దర్శనమిస్తున్నారు. బంగారు వ్యాపారులు టెస్టింగ్ మెషీన్‌లతో వ్యాపారం ప్రారంభించారు. టెస్టింగ్‌కు రూ.100 తీసుకుంటున్నారట. గతంలో కూడా తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్లూరు వెళ్లి.. అక్కడ కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారని చెబుతున్నారు. ఇప్పుడు అదే నమ్మకంతో బసవమ్మ వాగు వద్ద జరుగుతున్న వజ్రాల వేట కొనసాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే చాలు కోటీశ్వరులు కావొచ్చనే ఆశకో వజ్రాల కోసం వెతుకుతున్నారు.