ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. పురంధేశ్వరికి సోము వీర్రాజు బాధ్యతలను అప్పగించారు. విజయవాడ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాయలంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ముందు వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అంటూ మంత్రి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా అంటూ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను రిలీజ్ చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేదే పవన్ తాపత్రయమని ఆయన వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లాలో తెనాలి వైకుంఠపురంలో మహిళా ఉద్యోగ చేతివాటం బయటపడింది. దేవాలయంలోని కానుకల హుండి లెక్కింపు సందర్భంగా స్వామివారికి వచ్చిన కానుకల్లోని ఉంగరాన్ని దొంగతనం చేసింది మహిళా ఉద్యోగి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మనబడి నాడు-నేడు అనే కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రికి దర్శన ఏర్పాట్లు చేశారు.