Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం.. ఇది చంద్రుడిని ఎప్పుడు చేరుకుంటుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్-3 ప్రయోగం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్.. దీనిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మూడు దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 జాబిల్లి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
Also Read: Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్.. భారత్ చరిత్ర సృష్టించాలంటే అది జరగాలి..
Also Read
ఎల్వీఎం3 రాకెట్ మూడు దశలు విజయవంతంగా పూర్తి చేసుకుని, 100 శాతం ప్రయోగ విజయ రికార్డును కొనసాగించింది. ప్రయోగం తర్వాత ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ సరిగ్గా 900 సెకన్ల తర్వాత అంతరిక్ష నౌక చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను కక్ష్యలోకి చేర్చింది. ఇకపై స్పేస్ క్రాఫ్ట్ తనంతట తానుగా భూమిని ఐదారు సార్లు చుట్టి వస్తుంది. ఆ తర్వాత చంద్రుడి వైపుగా ప్రయాణం ప్రారంభిస్తుందని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ ప్రకటించారు ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3.. దాదాపు 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతారు. తర్వాత చంద్రుడి దిశగా కక్ష్యలోకి చంద్రయాన్-3ని పంపిస్తారు.
Also Read: Jammu & Kashmir: 32పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. లబోదిబోమంటున్న భర్తలు
అనంతరం దశలవారీగా దీని కక్ష్యను పెంచుతూ పోతారు. కావాల్సినంత ఎత్తుకు చేరిన తర్వాత చంద్రుడి వైపుగా ప్రయాణం ప్రారంభించి, ఆగస్టు 5న చంద్ర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం చంద్రుడి చుట్టూ కూడా తిరుగుతూ దశల వారీగా కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రుడికి 100 కిలోమీటర్ల దగ్గరగా వెళ్తుంది. చివరగా ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు లేదా ఆగస్టు 24వ తేదీన ల్యాండర్‌ను చంద్రుడిపైకి జారవిడుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ గా దిగుతుంది. ఆ వెంటనే ల్యాండర్ పై నుంచి రోవర్ కిందకు దిగి ముందుకు వెళ్తుంది. అది గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. నాలుగు ఇంజిన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. మొత్తం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృష్టించినట్లే.
రోవర్ ల్యాండింగ్‌కు ఇస్రో కష్టసాధ్యమైన ప్రాంతాన్ని ఎంచుకుంది. మిగిలిన దేశాలకు సాధ్యంకాని దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేసింది. ఇప్పటిదాకా చంద్రుడి మధ్యరేఖా ప్రాంతాన్ని ఎంచుకుంటే ఇస్రో మాత్రం దక్షిణ ధృవ ప్రాంతాన్ని సెలక్ట్ చేసింది. అంతా సవ్యంగా జరిగితే 40 రోజుల తర్వాత రోవర్ చంద్రుడిపై అడుగుపెడుతుంది. అదే జరిగితే చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా నిలుస్తుంది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్‌తో ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్ని తాకాయి.
తాజావార్తలు
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!