Triple Talaq: కట్నం దురాశతో ఓ వరుడు చేసిన పనికి వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బంధువుల ముందు వధువు కుటుంబసభ్యుల పరువు పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరోసారి ట్రిపుల్ తలాక్ ఘటన తెరపైకి వచ్చింది. కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లయిన రెండు గంటలకే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలున్నాయి. అనంతరం వరుడు నిఖా మండపంలో వధువును వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వధువు కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే సమయంలో వధువు సోదరుడు తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న అత్యాశపై కేసు పెట్టాడు. వధువుపై తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు వరుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై శుక్రవారం కేసు నమోదు చేయబడింది.
అసలేం జరిగిందంటే ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రకారం.. ఆగ్రాలోని ఫతేహాబాద్ రోడ్‌లోని ఓ మ్యారేజ్ హాల్‌లో ఇద్దరు సోదరీమణులు డాలీ, గౌరీల వివాహం ఒకే రోజు జరిగింది. పెద్ద కూతురు గౌరీ వివాహం అమన్‌తో జరిగింది. కుటుంబ సభ్యులు ఆచారాల ప్రకారం ఆమెకు వీడ్కోలు పలికారు. పెళ్లి వేడుక తర్వాత ఊరేగింపుగా గౌరీ అత్తమామలు వెళ్లిపోయారు. డాలీ వివాహం ఆసిఫ్‌తో జరిగింది. వివాహం తర్వాత.. ఆసిఫ్, అతని కుటుంబ సభ్యులు కట్నంగా కారును డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఒక్కసారిగా కారు డిమాండ్ చేయడంతో వధువు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: UCC: యూసీసీపై అభిప్రాయాలకు గడువు పొడిగింపు.. 28 వరకు అవకాశం
డాలీ తల్లిదండ్రులు కట్నంలోని ఇతర వస్తువులతో పాటు ఆసిఫ్‌కు కారు ఇస్తానని హామీ ఇచ్చారు. డాలీ కుటుంబానికి అక్కడికక్కడే కారు ఇప్పించాలని, లేదంటే రూ.5 లక్షలు ఇవ్వాలని వరుడి కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఇంత తక్కువ నోటీసులో కారు లేదా నగదును ఏర్పాటు చేయలేమని డాలీ కుటుంబం చెప్పింది. పెళ్లికొడుకును ఒప్పించాలని వధువు కుటుంబీకులు ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. లక్షల్లో కట్నకానుక విన్నవించినా వరుడు ఎవరి మాట వినలేదు. ఈ సమయంలో నవ వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పి వరుడు పెళ్లి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వధువు సోదరుడు కమ్రాన్ వాసీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆసిఫ్‌తో పాటు మరో ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఏడుగురినీ అరెస్టు చేయాలని వాసీ డిమాండ్ చేశారు. ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019 ప్రకారం మూడుసార్లు ‘తలాక్’ ఉచ్చరించడం ద్వారా స్త్రీకి విడాకులు ఇవ్వడం చట్టరీత్యా నేరం.