Mallikarjun Kharge: కామన్వెల్త్ క్రీడల్లో గడ్కరీ ఏం చేశారో తెలియదా? బీజేపీపై మల్లిఖార్జున్ ఖర్గే విమర్శలు
- కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఉదయ్ భాను అరెస్ట్
- అరెస్ట్‌పై స్పందించిన మల్లిఖార్జన్ ఖర్గే
- బీజేపీ అద్దంలో తన ముఖం చూసుకోవాలని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో న్యూసెన్స్ సృష్టించిన కేసులో జాతీయ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం 4:30 గంటలకు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే స్పందించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ… ‘‘కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నప్పుడు నితిన్ గడ్కరీ, ఇతర బీజేపీ నాయకులు ఏం చేశారో తెలియదా? ఈ వ్యక్తులు ప్రతి కార్యక్రమానికి వెళ్లి అక్కడ గందరగోళం సృష్టించలేదా? ఆ సమయంలో వారికి జాతీయవాదం గురించి తెలియదా? అప్పుడు జాతీయ భావాల గురించి.. దేశాన్ని ఐక్యంగా ఉంచడం గురించి ఆందోళన చెందలేదా? దేశం నలుమూలల నుంచి వచ్చే అనేక మంది అథ్లెట్లకు ఏ సందేశం పంపించారు? ఇతరులకు నీతులు చెప్పే ప్రయత్నం మానేయండి. ఇతరులకు బోధించడం మానేయండి. ముందు మీరు మారండి. అద్దంలో మీ సొంత ముఖాన్ని చూసుకోండి. అప్పుడు మీ చర్యలు ఏమిటో మీకు తెలుస్తాయి. అందరికీ మీ గురించి తెలుసు. మాకు నేర్పించవద్దు.’’ అని బీజేపీ నేతలకు మల్లిఖార్జన్ ఖర్గే హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Tahawwur Rana: ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు షాక్.. కెనడా కీలక నిర్ణయం!
Also Read
ఈనెల 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ సమ్మిట్ జరిగింది. దీనికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా అనేక దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. అయితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ఆధ్వర్యంలో కొందరు యువకులు సమ్మిట్‌లోకి ప్రవేశించి అర్ధనగ్నంగా ప్రదర్శించారు. అమెరికాతో డీల్ రద్దు చేసుకోవాలని నినాదాలు చేశారు. ఈ పరిణామంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 4:30 గంటలకు ఉదయ్ భానును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన జెన్ జెడ్ నుంచి యూత్ కాంగ్రెస్ ప్రేరణ పొందినట్లుగా కోర్టుకు పోలీసులు తెలిపారు.
#WATCH | Bengaluru, Karnataka: On IYC protest, during the AI Summit, Chief Uday Bhanu Chib, Congress President Mallikarjun Kharge says, "What did Nitin Gadkari and other BJP members do when the Commonwealth Games were going on? Didn't these people go to every event and create… pic.twitter.com/aS71P9KaQ4
— ANI (@ANI) February 24, 2026
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!