Ambati Rambabu: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. పవన్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీఆర్పీలో ఉన్నప్పుడే వైఎస్సార్‌ను పంచలు ఊడదీసి కొడతానన్నారని.. అప్పుడే పవన్ రాజకీయాలకు పనికి రాడని ప్రజలు అనుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. మాటపై నిలబడిన వ్యక్తిత్వం పవన్‌ది అంటూ మండిపడిన రాంబాబు.. అసభ్యపదజాలం వాడిన నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావా? అంటూ ధ్వజమెత్తారు. సంస్కారం గురించి పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గాలి కళ్యాణ్ వాలంటీర్లపై నీ అభ్యంతరం ఏంటి? అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: Big Breaking: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్‌కి యాత్రలు చేయడం అలవాటు. వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం సరికాదు.పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర కాదు, వారాహి యాత్ర చేస్తున్నాడని గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గతంలో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. చెప్పు తీసుకొని కొడతా అని బూతులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడతారంట. పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తిరగడం దుష్ట చతుష్టయం పథకం. కాపులను మచ్చిక చేసుకోవడానికి తిరుగుతున్నారు. వాలంటరీ వ్యవస్థపై మిస్టర్. గాలి కళ్యాణ్ నీకున్న అభ్యంతరం ఏంటి?. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పవన్‌కి ఆవహించి ఉంది. పవన్ కళ్యాణ్‌ని దగ్గరగా చూసిన వారు అవుట్. జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తే అర్హత పవన్ కళ్యాణ్‌కి లేదు. పవన్ ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డికి అడుగు దూరంలోకి కూడా రాలేవు. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నావ్? ఎంత టాక్స్ కడుతున్నావ్??. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటో లైట్ బాయ్ కూడా చెబుతారు. పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పటికి ఎమ్మెల్యే కాలేవు. చంద్రబాబుని సీఎంని చేయలేవు.” అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.