CHANDRAYAAN-3 Mission Launch LIVE : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ‘చంద్రయాన్-3’.. నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకోసం గురువారం మధ్యాహ్నం 1.05గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. నేడు మధ్యాహ్నం 2:35:13 గంటలకు చంద్రుడిపైకి బయలుదేరనుంది .జాబిల్లిపై ప్రయోగాలకోసం భారత్ మూడోసారి చేపడుతోన్న ఈ యాత్రపై యావత్ దేశంతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 మిషన్ లాంచ్.. ప్రత్యక్షప్రసారం