డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. అనుమానిత డ్రగ్ డీలర్ ఇంట్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన పోలీసులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి.
భవిష్యత్తులో కొత్త కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చైనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ హెచ్చరించారు. షి జెంగ్లీ జంతువుల నుంచి వచ్చే వైరస్‌లపై పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది. ఆమెను ప్రపంచంలో బ్యాట్ వుమన్ అని కూడా పిలుస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కారు భద్రతపై తప్పుడు హామీల కోసం ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత్‌కు సంబంధం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపించిన వారం రోజుల తర్వాత సోమవారం కెనడాలోని ప్రధాన నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని ఖలిస్థానీ గ్రూప్ తన సభ్యులకు పిలుపునిచ్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. గత వారం చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు ఈ యాప్ దాని గోప్యత, భద్రత కోసం ప్రతి ఒక్కరి మొదటి ఎంపికగా ఉంది.