స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును రెండు రోజుల్లో 12 గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ విచారణతో పాటు రిమాండ్ గడువు కూడా ముగిసింది
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ కొద్ది నిమిషాల్లో ముగియనుంది. సీఐడీ కస్టడీ తర్వాత వర్చువల్ విధానంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు సీఐడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. వినోద్ రెడ్డితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపి పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అంగీకరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకమైంది. 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండగులు సముద్రంలో పడేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. తాను సుమంగళిగా వర్థిల్లాలని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇది ఆశిస్తుంది. తన భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏ మహిళ సహించలేదు. కొందరు పెద్దలకు చెప్పుకుని బాధపడుతుంటారు. కానీ ఓ స్త్రీమూర్తి ఏమనుకుందో కానీ తన భర్తను గాడిన పెట్టి తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది.
తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.