తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ నిరంతరం కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంతో సందడి చేస్తోంది. రానున్న రోజుల్లో దేశీయ విపణిలోకి అనేక కొత్త కార్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి.
20వ శతాబ్దం ప్రారంభం నుంచి సైన్స్, హెల్త్ కేర్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందాయి. దీని కారణంగా మానవ జీవిత కాలం కూడా పెరిగింది. అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మనుషుల వయసు పెరిగింది.
మణిపూర్‌లో కలహాల నేపథ్యంలో రెండు రోజుల తర్వాత మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. కొన్ని రోజుల క్రితం అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరో దారుణ ఘటన బయటపడింది.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
దేశంలోని రాకెట్లలో ఉపయోగించే 95 శాతం విడిభాగాలు భారత్ నుంచి వచ్చినవేనని ఇస్రో ఛైర్‌పర్సన్ ఎస్.సోమనాథ్ మంగళవారం తెలిపారు. సీఎస్‌ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) 82వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇస్రో చీఫ్ ప్రసంగించారు.
అయోధ్యలో మూడంతస్తుల రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని, జనవరి 22న పవిత్రోత్సవం జరగనుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20-24 మధ్య ఏదైనా రోజున 'ప్రాణ ప్రతిష్ఠ'కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని భావిస్తున్నామన్నారు.
హర్యానా ప్రభుత్వం హుక్కా ప్రియులకు చేదువార్త అందించింది. హర్యానాలోని హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లలో ఇకపై హుక్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా అందించడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం ప్రకటించారు.