కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోల బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
చైనా నుంచి వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కొత్త వీసా రహిత ప్రవేశ కార్యక్రమం కింద సోమవారం బ్యాంకాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది మంది చైనీస్ పర్యాటకులకు థాయ్‌లాండ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కలబంద చర్మానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని అందరికి తెలిసిందే. కలబంద చాలా సాధారణమైన మొక్క. ఇది మీ బాల్కనీ లేదా తోటలో తరచుగా చూస్తారు. ఈ మొక్క చాలా సింపుల్‌గా కనిపించవచ్చు, కానీ ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.
రేపు(సోమవారం) మూడో రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్‌లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం, చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్‌లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాలపై ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని మృతి సంచలనం రేపుతోంది.17వ తేదీ రాత్రి అదృశ్యమైన కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ .. గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో శవమై కనిపించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. మరో 11 రోజుల పాటు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ పొడిగించారు. ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది.