Whatsapp Android Version Update: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు ఈ యాప్ దాని గోప్యత, భద్రత కోసం ప్రతి ఒక్కరి మొదటి ఎంపికగా ఉంది. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ ప్రతి నెలా కొత్త అప్‌డేట్‌లను చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కంపెనీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లతో కొన్ని పరికరాల నుంచి తన మద్దతును నిలిపివేస్తూ మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెసేసింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24 నుంచి పలు రకాల స్మార్ట్‌ఫోన్లకు వాట్సాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గతంలో కూడా పలు ఫోన్లకు వాట్సాప్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఎక్కువగా వాడుకలో లేని ఫోన్లు ఉండడం గమనార్హం. అవన్నీ పాత ఓఎస్‌తోనే రన్ అవుతున్నాయి.
అక్టోబర్ 24 తర్వాత ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1 అంతకంటే పాత వాటిపై నడుస్తున్న స్మార్ట్‌ఫోన్లకు అప్‌డేట్స్ నిలిపివేస్తున్నట్లు కంపెనీ ఇటీవల ఓ ప్రకటన చేసింది. పలు నివేదికల ప్రకారం 20కి పైగా స్మార్ట్ ఫోన్లు వచ్చే అక్టోబర్ నుంచి కొత్త ఫీచర్లు, సెక్యూరిటీతో సహా ఎలాంటి అప్‌డేట్స్ పొందలవు. చివరికి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. వాట్సాప్‌ను బిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు, అయితే మెసేజింగ్ యాప్ పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో పనిచేయడం మానేస్తుంది కాబట్టి త్వరలో వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది.
Also Read: Chicken Side Effects : రోజూ చికెన్ ఎందుకు తినొద్దో తెలుసా.. వామ్మో నిజామా?
అక్టోబర్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు..
*నెక్సస్ 7 (Android 4.2కి అప్‌గ్రేడబుల్)
*సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2
*హెచ్‌టీసీ వన్
*సోనీ ఎక్స్‌పీరియా Z
*ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో
*సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2
*శామ్‌సంగ్ గెలాక్సీ నెక్సస్
*హెచ్‌టీసీ సెన్సేషన్
*Motorola Droid Razr
*సోనీ ఎక్స్‌పీరియా S2
*మోటరోలా జూమ్
*శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1
*asus ee ప్యాడ్ ట్రాన్స్ఫార్మర్
*Acer Iconia Tab A5003
*శామ్‌సంగ్ గెలాక్సీ Ace
*హెచ్‌టీసీ డిజైర్ HD
ఎల్జీ ఆప్టిమస్ 2X
*సోనీ ఎరిక్సన్ xperia arc3
జాబితాలోని చాలా ఫోన్‌లు పాత మోడళ్లకు చెందినవని, ఈ రోజు చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలిసిందే. మీరు ఇప్పటికీ ఈ ఫోన్‌లలో ఒకదాన్ని కలిగి ఉంటే, మీరు కొత్త పరికరాన్ని పొందాల్సిందే. ఎందుకంటే వాట్సాప్ మాత్రమే కాదు, అనేక ఇతర యాప్‌లు కూడా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తమ మద్దతును నిలిపివేస్తాయి. ఇది కాకుండా, కొత్త భద్రతా నవీకరణలు లేకుండా, మీ ఫోన్ హ్యాక్ చేయబడుతుందనే భయం కూడా ఉంటుంది.
మీ స్మార్ట్‌ఫోన్ OS వెర్షన్‌ను ఎలా తనిఖీ చేయాలంటే?
ఇప్పుడు మన ఫోన్‌లోని స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్‌ను ఎలా తనిఖీ చేయవచ్చు అనే ప్రశ్న చాలా మంది మనస్సులో ఉంటుంది. దీని కోసం మీరు మొదట మీ పరికరంలోని సెట్టింగ్‌ల మెనూకి వెళ్లవలసి ఉంటుంది. సెట్టింగ్‌లు > ఫోన్ గురించి > సాఫ్ట్‌వేర్ వివరాలు, ఇక్కడ మీరు మీ ఫోన్ వెర్షన్‌ను చూడొచ్చు.