Khalistani Group: కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistani group urges followers to protest outside Indian embassies in Canada: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత్‌కు సంబంధం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపించిన వారం రోజుల తర్వాత సోమవారం కెనడాలోని ప్రధాన నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని ఖలిస్థానీ గ్రూప్ తన సభ్యులకు పిలుపునిచ్చింది. కెనడాలోని భారత రాయబార కార్యాలయాల వెలుపల నిరసన తెలియజేయాలని ఖలిస్తానీ గ్రూప్ అనుచరులను కోరింది.
Also Read: Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ భారత్‌ను ముక్కలు చేయాలనుకున్నాడు..!
Also Read
అధిక సిక్కు జనాభా కలిగిన వాంకోవర్ శివారులోని సర్రేలో జూన్ 18న గురుద్వారా వెలుపల కాల్చి చంపబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉండవచ్చనే ఆరోపణలను కొనసాగిస్తున్నట్లు ట్రూడో చెప్పారు. ఈ హత్యలో ఎలాంటి పాత్ర లేదని భారతదేశం వేగంగా ఖండించింది. ఆరోపణలను అసంబద్ధంగా అభివర్ణించింది. ఈ ఆరోపణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించాయి. ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. కెనడియన్లకు భారత్ వీసాలను నిలిపివేసింది.
Also Read: AIADMK: బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న ఏఐఏడీఎంకే
కెనడాలోని సిక్కూస్ ఫర్ జస్టిస్ డైరెక్టర్ జతీందర్ సింగ్ గ్రేవాల్ ఆదివారం రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. నిజ్జార్ హత్యపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తమ సంస్థ టొరంటో, ఒట్టావా, వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల వెలుపల ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తుందని చెప్పారు. భారత రాయబారిని బహిష్కరించాలని కెనడాను కోరుతున్నామని గ్రేవాల్ తెలిపారు. టొరంటో పోలీస్ డిపార్ట్‌మెంట్ సోమవారం ప్రణాళికాబద్ధమైన ప్రదర్శనల గురించి తమకు తెలుసునని, అయితే భద్రతా సన్నాహాలు లేదా నిరసన సమయంలో తలెత్తే హింసాత్మక పరిస్థితులకు ప్రతిస్పందన వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. నిజ్జర్ దాదాపు 25 ఏళ్ల క్రితం పంజాబ్ వదిలి కెనడా పౌరసత్వం పొందాడు. భారతదేశం జూలై 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!