IND Playing 11 vs SA: సంజూ శాంసన్ రిటర్న్, బౌలింగ్‌లో కీలక మార్పులు.. దక్షిణాఫ్రికాతో ఆడే భారత్ ఫైనల్ టీమ్ ఇదే!
- ఈరోజు నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ఆరంభం
- ఆదివారం తలపడనున్న భారత్, దక్షిణాప్రికా జట్లు
- దక్షిణాఫ్రికాతో ఆడే భారత్ ఫైనల్ టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing 11 vs South Africa in T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈరోజు నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. నేడు కొలంబోలో పాకిస్తాన్, న్యూజీలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఇక భారత్, దక్షిణాప్రికా జట్లు ఆదివారం (ఫిబ్రవరి 22) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ఈ రెండు తలపడగా.. భారత్ గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరోసారి దక్షిణాప్రికాపై గెలిచి సూపర్-8లో ముందడుగు వేయాలని టీమిండియా చూస్తోంది. భారత్‌పై గెలిచి ఫైనల్ ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీలు చుస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. ముఖ్యంగా కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అహ్మదాబాద్‌లో సుదీర్ఘ సమయం నెట్స్‌లో చెమటోడ్చాడు. సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న తీరు చూస్తుంటే.. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు తిలక్ వర్మ స్థానంలో అతడు ఆడే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో.. తెలుగు ఆటగాడు తిలక్‌ను పక్కన పెట్టి సంజూకు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
వరుసగా మూడు డకౌట్స్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మపై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచనుంది. సూపర్-8 లాంటి కీలక దశలో అతడు లయ అందుకుంటే టీమిండియాకు మంచి ఆరంభం దక్కుతుంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే మెరుపులు మెరిపిస్తున్నాడు. కిషన్ నుంచి మరో కీలక ఇన్నింగ్స్ జట్టు కోరుకుంటోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పరుగులు చేస్తుండడం కలిసొచ్చే అంశం. ఇక హిట్టర్ శివమ్ దూబే మంచి దూకుడు మీదున్నాడు. అతడు బాదే సిక్సులు చూస్తే మతిపోతోంది. రింకూ సింగ్ తనకు వచ్చిన అవకాశాల్లో రఫ్ఫాడిస్తున్నాడు.
Also Read: Usman Tariq Controversy: భారత ఆటగాళ్లకు ఓ రూల్, మాకు మరో రూలా?.. పాక్ బౌలర్ తారిక్ ఫైర్!
బౌలింగ్ లైనప్‌లో కూడా కొన్ని అనూహ్య మార్పులు జరిగనున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ డెప్త్‌తో పాటు పొదుపైన బౌలింగ్ కోసం అక్షర్ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోందట. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పిచ్ కండిషన్స్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అవసరం దృష్ట్యా అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంబీర్ భావిస్తున్నారట. బుమ్రా, చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును ఢీకొట్టడానికి ఈ మార్పులు అవససరం అని ఫాన్స్, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జట్టు మార్పులలో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
భారత్ ఫైనల్ టీమ్:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!