Kerala Drug Dealer Trains Dogs to Bite Anything in khakhi: డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. అనుమానిత డ్రగ్ డీలర్ ఇంట్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన పోలీసులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఖాకీ దుస్తుల్లో వచ్చిన వారిని గాయపరిచేలా వాటికి శిక్షణ ఇచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో కేరళలోని కొట్టాయంలో ఓ వ్యక్తి ఇంట్లో ఆదివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ బృందంలో ఘటనాస్థలానికి సమీపంలో పీఎస్‌కు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. తనిఖీ కోసం పోలీసులు ఖాకీ దుస్తుల్లో ఇంట్లోకి వెళ్లగా.. వారిపైకి కుక్కలు దూసుకెళ్లాయి. కుక్కలు ఉండడం ఆదివారం రాత్రి తనిఖీ ప్రక్రియకు ఆటంకం కలిగించింది. కుక్కల దాడులను నివారించడంపై దృష్టి సారించిన పోలీసుల నుంచి నిందితులు కూడా తప్పించుకోగలిగారు. అయితే, కుక్కలను అదుపు చేశామని, ఘటనా స్థలం నుంచి 17 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Also Read: Uttar Pradesh: పెళ్లైన తొలి రోజు నుంచే అరాచకం.. అబ్బాయి కాదు అమ్మాయి
కొట్టాయం ఎస్పీ కె కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ.. సమీపంలోని గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారులతో సహా సెర్చ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకునే సరికి అర్ధరాత్రి దాటింది.ఇక్కడ చాలా కుక్కలు ఉంటాయని మరియు అవి హింసాత్మకంగా ఉంటాయని మేము ఊహించలేదు. అందువల్ల, సరైన శోధనను నిర్వహించడంలో మేము మొదట్లో ఇబ్బందులను ఎదుర్కొన్నాము. అదృష్టవశాత్తూ అధికారులెవరూ గాయపడలేదు.నిందితులు కుక్కలకు ఖాకీ దుస్తులను చూసే వెంటనే కరిచేలా శిక్షణ ఇచ్చాడు. అతడు ఒక డాగ్ ట్రైనర్‌గా చెలామణి అవుతున్నాడు. అతను విశాంత్ర బీఎస్‌ఎఫ్ అధికారి వద్ద కుక్కలను కంట్రోల్ ఎలా చేయాలని విషయంపై శిక్షణ పొందాడు. అయితే ప్రత్యేకంగా ఖాకీ దుస్తులు ధరించిన వారిని గాయపరచడం గురించి ప్రశ్నలు అడగడంతో అతడిని గెంటేశారు. కానీ ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో శునకాల ట్రైనర్‌గా అందరికీ పరిచయం కావడంతో.. ఆ ప్రాంతవాసులు అతడింట్లో తమ కుక్కలను వదిలివెళ్లేవారు. అందుకోసం ఒక్కో కుక్కకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు’ అని ఎస్పీ కార్తిక్ తెలిపారు.
Also Read: KTR: డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేయాలని చూస్తున్నారు..
నిందితుడు డాగ్ ట్రైనర్‌గా మారి డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, ఆ స్థలం నుంచి 17 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకోవడంతో ఇది స్పష్టమవుతోందని జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 13 కుక్కలు ఉన్నాయని, వాటి యజమానులను గుర్తించి కుక్కలను వారికి అప్పగిస్తామన్నారు. దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. “మేము ముందుగా నిందితుడిని పట్టుకోవాలి. ఈ రాకెట్‌లో మరెవరైనా ప్రమేయం ఉన్నారో లేదో కనుక్కోవాలి” అని అధికారి చెప్పారు. అక్కడ జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలు గురించి అందిన సమాచారం, తదుపరి విచారణ ఆధారంగా ప్రాంగణానికి సెర్చ్ వారెంట్ పొందాలని పోలీసులు నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు.