Uttarpradesh: కారులో ఎయిర్‌బ్యాగ్‌లు లేవని.. ఆనంద మహీంద్రాతో పాటు మరో 12 మందిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కారు భద్రతపై తప్పుడు హామీల కోసం ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌కు చెందిన 12 మంది ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది. ఎయిర్‌బ్యాగ్‌లు లేని స్కార్పియో కారును కంపెనీ తనకు విక్రయించిందని, తన కొడుకు కారు ప్రమాదంలో మరణించాడని ఫిర్యాదుదారు రాజేష్ మిశ్రా ఆరోపించారు. రాజేష్ మిశ్రా తన కుమారుడు అపూర్వ్‌కు బహుమతిగా 2020లో బ్లాక్ స్కార్పియోను రూ. 17.39 లక్షలకు కొనుగోలు చేశారు.
Also Read: Central Team in AP: స్థానిక సంస్థల నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు.. విచారణకు కేంద్ర బృందం
Also Read
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
జనవరి 14, 2022న, స్నేహితులతో కలిసి లక్నో నుండి కాన్పూర్‌కు తిరిగి వస్తుండగా, పొగమంచు కారణంగా అపూర్వ్ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఫలితంగా అతను అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత, జనవరి 29న రాజేష్ తాను కారు కొన్న ఆటో స్టోర్ వద్దకు చేరుకుని, కారులోని లోపాలను ఎత్తిచూపారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రమాదం సమయంలో సీటుబెల్ట్ బిగించినప్పటికీ, ఎయిర్‌బ్యాగ్ అమర్చడంలో విఫలమైందని ఫిర్యాదుదారు తెలిపారు. కంపెనీ తప్పుడు హామీలిచ్చి మోసం చేసిందని రాజేష్ మిశ్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Asian Games 2023: టెన్నిస్‌లో భారత్కు నిరాశ.. తొలి రౌండ్‌లోనే ఔట్
వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే తన కొడుకు చనిపోయేవాడు కాదని రాజేష్ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. కంపెనీ ఉద్యోగులు రాజేష్‌తో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. డైరెక్టర్ల సూచనల మేరకు నిర్వాహకులు తనను, తన కుటుంబాన్ని దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ప్రమాదం తర్వాత, స్కార్పియోను రుమాలోని మహీంద్రా కంపెనీ షోరూమ్‌కు తరలించారు. కంపెనీ వాహనంలో ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయలేదని రాజేష్ అభిప్రాయపడ్డారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (మోసం), 287 (యంత్రాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం), 304-A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!