గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి అక్టోబర్ నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి ఖతార్ కోర్టు విధించిన మరణ శిక్షలను తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దహ్రా గ్లోబల్ కేసులో ఖతార్ అప్పీల్ కోర్టు శిక్షలను తగ్గించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం జరిగిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సులో 'ఫిట్‌నెస్ సర్టిఫికేట్' లేదని గుర్తించారు. ఇక, ఆ బస్సు బీజేపీ నేతకు చెందినదని తెలిసింది.
ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్‌లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలన్న మిత్రపక్షం శివసేన (యూబీటీ) డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ భాగస్వాములైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్‌సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించడానికి నాయకులు సమావేశమైన తర్వాత ఈ పరిణామం జరిగింది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు డీప్‌ఫేక్‌ల సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఉన్న ఐటీ నిబంధనలను అనుసరించాలని ఆదేశిస్తూ ఒక అడ్వయిజరీ జారీ చేసింది.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో 'పేలుడు' సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం కాన్సులేట్ భవనం సమీపంలో పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది.
అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.
అంగన్వాడీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.