జమ్మూ కాశ్మీర్‌లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రకారం.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు అసంతృప్తి గళం విప్పుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్యీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది.
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్‌లు చర్చల ద్వారా వివాదాలకు ముగింపు పలకకపోతే, గాజా, పాలస్తీనాకు ఎదురైన గతినే కాశ్మీర్ ఎదుర్కొంటుందని అన్నారు.
కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం బిల్లులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
మడకశిర తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్‌పై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మడకశిర తహశీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు సస్పెండ్ చేశారని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
NDA vs INDIA: 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని పెంచుకుంటున్నాయి. ఇందులో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్యే ఉంటుంది. అయితే అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో ఎవరు గెలుస్తారు. ఇందుకు సంబంధించి సీ-వోటర్‌తో ఏబీపీ సర్వే నిర్వహించింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతంలో బీజేపీ బలమైన స్థానంలో ఉందని […]
ఉగ్రదాడి సూత్రధారి, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని పాక్ ఆంగ్ల దినపత్రిక డాన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్‌లోని ప్రతి జాతీయ, ప్రావిన్సు అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థులను నిలబెట్టినట్లు సమాచారం.
రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.