డిసెంబర్ 30న ప్రారంభించనున్న అయోధ్యలోని విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్'గా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన చేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ఐఐటీ బొంబాయి వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ ఫెస్టివల్‌లో ఆయన మిషన్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
కన్నడ అనుకూల సంస్థలు సైన్‌బోర్డ్‌లు, నేమ్‌ప్లేట్లు, ప్రకటనలపై కన్నడ భాషను ప్రదర్శించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకస్మికంగా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. సైన్‌బోర్డ్‌లో 60 శాతం కన్నడలో ఉండాలని ఆయన తెలిపారు.
శీతాకాలం కావడంతో రష్యాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఆ దేశంలో అత్యధిక ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చలితో అక్కడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. కొన్ని ప్రాంతాల్లో నదులు కూడా గడ్డకట్టుకుపోయి అక్కడ నది ఉందో లేదో కూడా అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి.
కర్ణాటకలో పాఠశాల విద్యార్థులను మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివమొగ్గ జిల్లాకు చెందిన ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం చర్య తీసుకుంది.
సోషల్ మీడియా వేదికగా పాటలు వినడానికి మొబైల్ ఫోన్ అడిగిన భర్త కంట్లో కత్తెరతో పొడిచేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ కాలనీలో జరిగింది.
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఖతీపురాలోని రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించారని జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్‌తో కొట్టివేసింది.
యూరప్‌కు ముఖద్వారమైన ఇటలీ భారతీయులకు తలుపులు తెరిచింది. భారత్, ఇటలీ ఇటీవల 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ' ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి భారత మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటలీతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందాలను బలోపేతం చేయడమే కాకుండా అక్రమ వలసలను కూడా నిరోధించనుంది.
ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేయగలరా.. అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో పౌల్టీఫారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి పౌల్ట్రీ ఫామ్‌లోని సుమారు 5 వేల కోళ్లు బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహతైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు.