టి దీపోత్సవం వేళ హైదరాబాద్ మహా నగరం సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే తొమ్మిది రోజులు విజయవంతంగా ముగిశాయి. కోటి దీపాల పండుగ.. కోటి దీపోత్సవం నేటితో పదో రోజు ఘనంగా ప్రారంభమైంది.
ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. నెలల వయసున్న చిన్నారి నుంచి వృద్ధుల వరకు వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా దుర్మార్గులు అకృత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ఆ స్కీంను మాత్రం కొనసాగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకులోకి మళ్లిస్తామని తెలిపింది. శ్రీవారి భక్తులకు రెండు మూడు గంటల సమయంలోనే దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంతమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులేనని.. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల గురించి ఆయన ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి, మరాఠా పరాక్రమానికి చిహ్నంగా, సనాతన ధర్మ రక్షకునిగా నిలుస్తుందన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, నాయకత్వ వారసత్వంతో తరాలకు స్ఫూర్తినిచ్చే ఈ పుణ్యభూమిని సందర్శించడం గర్వకారణంగా ఉందన్నారు.
రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనమండలిలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్దేశ్వరం - అలుగు ప్రాజెక్ట్‌పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు.
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'కోటి దీపోత్సవం' తొమ్మిదో రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి (నవంబర్ 18) 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో […]
రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.