పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి, వెన్నెముక లాంటిదని.. అది పూర్తయితే ఏపీ కరవుకు చెక్ పెట్టినట్లేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఉన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ పోలవరం అని పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫేజ్ - 1, ఫేజ్ - 2 అని ఏ రోజూ మేం చెప్పలేదన్నారు.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిపై హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ శాసనమండలి స్పందించింది. ఇందుకూరి రఘురాజును ఎమ్మెల్సీగా తిరిగి శాసనమండలి గుర్తించింది. ఇటీవల విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌పై రఘురాజు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కాగా.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
"దీపం ఐక్యతకు చిహ్నం.. ఆ ఐక్యతే మనకు బలం.. మనలో ఆ ఐక్యత కొనసాగాలని ఆశిస్తూ.. అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది.. ఇటువంటి దీపోత్సవాల ద్వారా ప్రతి ఇల్లు ఒక ఇల్లు దేవాలయం కావాలి.. జ్ఞానసంపదకు క్షేత్రం కావాలి" అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోటి దీపోత్సవానికి హాజరై ప్రసంగించారు.
భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 'కోటి దీపోత్సవం' కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కార్తిక సోమవారం శుభవేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్‌కు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన బృందం దాడి చేసింది. ఎలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు.
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024లను శాసనసభ ఆమోదించింది.