Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Kill Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచనల కథనం వెలువరించింది. ఖమేనీ లక్ష్యంగా 30 బాంబు దాడులు జరిగినట్లు ఈ కథనంలో పేర్కొంది. శనివారం ఉదయం ఆపరేషన్ ఖమేనీని అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా షురూ చేసిందని వెల్లడించింది. శనివారం ఉదయం 1:15 AM ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఫొర్టిఫైడ్ కాంపౌండ్‌లోనే ఖమేనీ ఇల్లు, ఆఫీస్ ఉండటంతో దాని ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించగా, అమెరికా తొమహాక్ మిస్సైళ్లతో ఎటాక్ చేసినట్లు తెలిపింది.
READ ALSO: Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!
Also Read
ఖమేనీపై ఈ రెండు దేశాలు గత కొన్నినెలలుగా ఫోకస్ చేశాయని, అమెరికా – ఇజ్రాయెల్ ఆపరేషన్ కిల్ ఖమేనీపై నెలలపాటు ప్లాన్ చేశాయన్నారు. ఈ ఆపరేషన్‌కు సౌదీ, గల్ఫ్ దేశాలు కూడా మద్దతు తెలిపినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. రెండు వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, సీఐఏ, మొసాద్ ఖమేనీ పక్కా సమాచారం సేకరించినట్లు తెలిపింది. శాటిలైట్ ద్వారా ఖమేనీ లోకేషన్‌ను ట్రెహాన్‌లోని ఖమేనీ ఆఫీసులో ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.
శనివారం టాప్ అధికారులతో ఖమేనీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమేనీతో పాటు ఐఆర్‌జీసీ కమాండర్ పక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నసిర్, సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీతో సహా 30 మందితో సమావేశం అయ్యారు. మీటింగ్ జరుగుతుండగానే అమెరికా-ఇజ్రాయెల్ లోకేషన్ గుర్తించి 15 నిమిషాల్లోనే ఎటాక్ కంప్లీట్ చేశాయి. ఖమేనీ కాంపౌండ్‌పై కనీసం7 మిస్సైళ్లతో దాడులు చేయగా, ఫోర్టిఫైడ్ కాంపౌండ్ కుప్పకూలిపోయింది. కూలిన భవనంలోనే ఖమేనీ మృతదేహం లభ్యం అయినట్లు తెలిపింది. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా ఈ దాడులో మృతి చెందినట్లు తెలిపింది. ప్రస్తుతం వాల్‌స్ట్రీల్ జర్నల్ సంచనల కథనం వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఖమేనీ మృతికి యూఎస్, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ స్థావరాలపై కనీవిని ఎరుగని రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ జెరుసలెంపై ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. తాజాగా ఇరాన్.. ఇరాక్, బెహ్రయిన్ టార్గెట్‌గా మిస్సైల్స్ ఎటాక్‌కు రెడీ అవుతుంది. ఇరాక్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూఎస్ ఎయిర్‌బేస్‌పై కూడా దాడి చేసింది. అలాగే బెహ్రయిన్‌లో ఓ హోటల్‌పైనా ఇరాన్ దాడి చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?