TTD: శ్రీవాణి ట్రస్ట్ రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
- శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం
- ట్రస్ట్‌ను రద్దు చేసినా పథకాన్ని కొనసాగించనున్న టీటీడీ
- సామాన్య భక్తులకు 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం కలిగిలా చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ఆ స్కీంను మాత్రం కొనసాగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకులోకి మళ్లిస్తామని తెలిపింది. శ్రీవారి భక్తులకు రెండు మూడు గంటల సమయంలోనే దర్శనం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్యమతస్థ ఉద్యోగులను ప్రభుత్వ శాఖలోకి బదిలీ చేస్తామన్నారు. తిరుమలలో ఉన్న వ్యర్థపదార్థాలను రెండు మూడు నెలల కాలంలో తరలిస్తామని చెప్పారు. తిరుపతిలో ఉన్న ప్లై ఓవర్‌కి తిరిగి గరుడ వారధిగా నామకరణం చేశామన్నారు.
Read Also: Andhra Pradesh: ఇకపై ఎంతమంది పిల్లలున్నా పోటీకి అర్హులే..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అలిపిరి వద్ద టూరిజం శాఖకు కేటాయించిన 20 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ముంతాజ్ హోటల్‌ని నిలిపివేసి ఆ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై ఆంక్షలు విధించామన్నారు. స్థానికులకు గతంలో లాగానే మొదటి మంగళవారం దర్శనం కల్పించే విధానాన్ని పున:రుద్దరణ చేస్తామన్నారు. అన్నప్రసాదంలో భక్తులకు అందించే మెనూలో అదనంగా కొన్ని పదార్థాలు చేరుస్తామన్నారు. లడ్డు ప్రసాదంలో వినియోగించే పదార్థాల నాణ్యత పెంపుకి నిపుణులు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మోత్సవం బహుమానంగా ఉద్యోగులకు రూ.15,400 అందిస్తామన్నారు. శారదా పీఠంకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుంటుందన్నారు. టూరిజం శాఖకు కేటాయించే టిక్కెట్ల విధానాన్ని రద్దు చేశామన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?