Andhra Pradesh: పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంతమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులేనని.. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024 కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Read Also: Pawan Kalyan: మహారాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ హామీలు.. వీలైనంత త్వరగా అమలు చేస్తాం..
బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ సభలో ప్రతిపాదించారు. జనాభా వృద్ది రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. శాసనమండలి ఆమోదం తర్వాత జీవో జారీ చేయగానే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. గతంలో ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉంటే పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.