Koti Deepotsavam Day 9: కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ తొమ్మిదో రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని తొమ్మిదో రోజు విజయవంతం చేశారు. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు.
తొమ్మిదో రోజు కోటి దీపోత్సవంలో భాగంగా శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ప్రవచనామృతం వినిపించారు. వేదికపై ప్రసిద్ధక్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన జరిగింది. భక్తులచే అమ్మవారి విగ్రహాలకు కోటి కుంకుమార్చన చేశారు. జన్మనక్షత్ర దోషపరిహారానికై నక్షత్ర పూజను నిర్వహించారు. కోటి దీపోత్సవం వేదికపై శ్రీ లక్ష్మీనారాయణుల కల్యాణాన్ని వైభవంగా జరిగింది.కోటి దీపోత్సవ ప్రాంగణంలో భక్తుల చెంతకు పల్లకీలో శ్రీ లక్ష్మీనారాయణులు సాక్షాత్కారించారు. చివరలో సప్త హారతి, లింగోద్భవం, పరమేశ్వరుడికి మహానీరాజనం కార్యక్రమంతో తొమ్మిదో రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవంతంగా ముగిసింది.