నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు హాస్పటల్‌లో వాచ్‌మెన్ వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో అక్కడి వాచ్‌మెన్, సిబ్బందే వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేస్తున్నారు. ఇంజెక్షన్‌లు చేస్తూ మందులు కూడా ఇస్తున్నారు.
మహారాష్ట్ర బల్లార్‌పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు.
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుందన్నారు.
తమిళ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు. నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్‌లో కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరును అఫ్కాన్ సంస్థ మార్చింది. శ్రీనివాస సేతు స్థానంలో గరుడవారధిగా పేరును అధికారులు మార్చేశారు. 2018 గరుడవారధి పేరుతో ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
ఐపీఎల్ 2025 కోసం వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. ఈసారి మెగా వేలం జరగనుండడంతో రెండు రోజుల పాటు జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. ఈ వేలంలో 574 మంది ఆటగాళ్లలో కేవలం 204 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. బిడ్‌లో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేవు.
యూట్యూబర్ బాక్సర్‌గా మారిన 27 ఏళ్ల జేక్ పాల్ ప్రముఖ బాక్సర్‌లలో ఒకరైన 58 ఏళ్ల మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్‌ను ఓడించాడు. డల్లాస్ కౌబాయ్స్ హోమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 27 ఏళ్ల జేక్ పాల్ కీలక మ్యాచ్‌లో టైసన్‌ను ఓడించాడు ఏకగ్రీవ నిర్ణయంతో జేక్ పాల్ గెలిచాడు.
1643 కిలోమీటర్ల పొడవైన భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందులో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో అతిపెద్ద సమస్య ఒకటి. అంటే ప్రవేశించలేని ప్రాంతాల్లో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయడానికి కూలీలు సులభంగా అందుబాటులో ఉండరు. దీని కారణంగా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసే ఈ పని ఊపందుకోవడం లేదు.