తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నేడు సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు.
రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
NTV Daily Astrology As on April 17th 2024, NTV Daily Astrology, Daily Astrology As on April 17th 2024, Daily Astrology, Zodiac Signs, Rasi Phalalu, Dina Phalalu
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది.
మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను మార్చి 21న అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
శనివారం అర్ధరాత్రి ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయెల్‌పై వేగవంతమైన వైమానిక దాడులను ప్రారంభించినప్పుడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరాన్ 300 కంటే ఎక్కువ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని, వాయు రక్షణ వ్యవస్థ ద్వారా దాదాపు అన్నింటినీ నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.