*నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. శ్రీ రామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు. దీంతో తణుకు తేతలిలో రాత్రి బస చేశారు సీఎం జగన్. తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేసిన జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాత్రి కూడా ఇక్కడే బస చేయనున్నట్లు తెలిసింది. సీఎం జగన్ రోజంతా శిబిరంలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి గురువారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రేపు జగన్ బస చేసిన శిబిరం నుంచి బయల్దేరి తూర్పు గోదావరి జిల్లా బయల్దేరి జగన్ వెళతారు. రేపు రావులపాలెం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రావులపాలెం జాతీయ రహదారిపై రోడ్‌షో నిర్వహించనున్నారు. కడియం మీదుగా పొట్టిలంక నుంచి బుర్రిలంక మీదుగా వేమగిరి వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. వేమగిరి నుంచి మోరంపూడి మీదుగా రాజమండ్రి సిటీలోకి రోడ్ షో రానుంది.
*నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం..
శ్రీరామ నవమి సందర్బంగా నేడు (బుధవారం) భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగబోతుంది. శ్రీ సీతారామల కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరగనుంది. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిలా కళ్యాణ మండపంకు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కళ్యాణ క్రతువు కొనసాగనుంది. అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉండటంతో భద్రాచలంలో జరిగే శ్రీరాముడి కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమర్పించనున్నారు. 1800 మంది పోలీసులతో ఆలయ పరిసరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, శీరామ నవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి తరలి వచ్చే అవకాశం ఉంది. అలాగే, 31 వేల మంది భక్తులు కళ్యాణం వీక్షించేలా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. కళ్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభితమైన మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. ఎండలు, ఉక్కబోతతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 50 టన్నుల ఏసీతో పాటు, వంద కూలర్లు, 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇక, రాములోరి కళ్యాణానికి తరలివచ్చిన అశేష భక్త జనానికి ఇబ్బందులు లేకుండా ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదాలు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తజనానికి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు కొనసాగుతుంది. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ శాఖ చేస్తుంది. పార్కింగ్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్యూఆర్ కోడ్ తో భక్తులకు పోలీసులు దిశా నిర్దేశం చేస్తున్నారు.
*మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
ప్రస్తుతం భారతదేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తోంది. ఇందులో భాగంగా అనేక ఆంక్షలు నడుమ రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల నియమాలను గుర్తుచేస్తున్న గాని మరోవైపు రాజకీయ నాయకులు ఒక్కోసారి వాటిని అతిక్రమించి ఎలక్షన్ కమిటీ చేత నోటీసులను ఇప్పించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు కూడా ఈసీ ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది. ఇక తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఎలక్షన్ కమిటీ నోటీసులు జారీ చేసింది. న్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌కు నోటీసు ఇచ్చింది ఈసీ. ఏప్రిల్ 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 5 వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ నోటీసును జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 18 గురువారం ఉదయం 11 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
*ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 20న హనుమంత వాహనంపై రాములవారు దర్శనం ఇవ్వనున్నారు. 21న స్వామి వారికి గరుడసేవ నిర్వహించనున్నారు. 22న పండు వెన్నెలలో జరగనున్న కల్యాణ వేడుకలు జరగనున్నాయి. 26న పుష్ప యాగంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల 22న సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని బహిరంగ ప్రదేశంలో లక్షలాది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నేడు ద్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతికి చెందిన ఆగమశాస్త్ర పండితులు రాజేశ్ కుమార్ భట్టార్ సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 22న సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 11వ శతాబ్ధంలో నిర్మించిన ఏకశిలానగరి ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి.
*నేడు హైదరాబాద్ లో వైన్ షాప్స్ బంద్..
శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధించారు. నేటి ఉదయం ఉదయం 6 గంటల నుంచి రేపు ( గురువారం ) ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లుకాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. షాపుల యజమానులు ఈ విషయాన్ని గమనించి మద్యం విక్రయాలను క్లోజ్ చేయాలని తెలిపారు. ఎక్కడైనా మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం అందితే ఆ షాపు యజమానులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక, నేడు వైన్ షాపులు బంద్ అని తెలియడంతో నిన్న ( మంగళవారం ) మందుబాబులు మద్యం దుకాణాల దగ్గర క్యూ కట్టారు. నిన్న ఎత్తున బీర్లను కొనుగోలు చేయడంతో స్టాక్ పూర్తిగా అయిపోయినట్లు మద్యం షాప్స్ ప్రకటించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి కొనసాగుతుంది. రేషన్ ఆధారంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20-25 కేస్ లు ఇస్తుండగా.. ఇవి సరిపోవడంలేదని మద్యం దుకాణాల యజమానులు వాపోతున్నారు. అయితే, హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 12 లక్షల కేస్‌లకు పైగా బీర్ల అమ్మకాలు జరిగితే.. ప్రస్తుతం 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేస్ ల బీర్లు విక్రయాలు జరుగుతాయని పలు గణాంకాలు చెబుతున్నాయి.
*నేటితో ముగియనున్న మొదటి విడత ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్
దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మొత్తం ఏడు విడతలలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే లోకసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన సంఘటన ఇదివరకే మనకు వేదితమే. ఇకపోతే తొలి దశ లోకసభ ఎన్నికల సమయం దగ్గర పడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. నేటి సాయంత్రం ఐదు గంటలకు స్పీకర్లు, మైకులను ఇక ఆపేయాల్సిందే. మొదటి విడతలో భాగంగా 102 లోకసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటి విడుదల భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలతో పాటు.. పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షదీప్ కేంద్రపాంత ప్రాంతాల్లో కూడా మొదటి దశ పోలింగ్ ను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఆయా ప్రాంతాలకు సంబంధించి బందోబస్తు చేసేందుకు ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయి అన్న విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని రామ్ టెక్, నాగ్ పూర్, గడ్చిరౌలి, బందారా గోండియా, చంద్రాపూర్, చిముర్ స్థానాలకు , వెస్ట్ బెంగాల్ లోని కుచ్ బిహార్, జల్పైగురి, అలీపుర్ దౌర్స్ లోక్ సభ స్థానాలకు, యూపీలోని షహరాన్ పూర్, కైరానా, ముజఫర్ నగర్, నగినా, బిజనూర్, పిల్ బిత్, మొరాదాబాద్, రామ్ పూర్ స్థానాలకు., ఉత్తరాఖండ్ లో 5 లోక్ సభ స్థానాలకు, ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ లో 2, మణిపూర్ లో 2, మేఘాలయలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్ లో 1, సిక్కిం, త్రిపుర, ఛత్తీస్ గఢ్, జమ్ము-కశ్మీర్ లలో ఒక్కో లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
*జార్ఖండ్‌లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో సోమవారం – మంగళవారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది. సమాచారం ప్రకారం లుద్రాబాసాలో నివసిస్తున్న గురుచరణ్ పాడియా మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య జానోతో తరచూ గొడవపడేవాడు. మద్యం సేవించి రాత్రి 2.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై భార్యతో గొడవ మొదలైంది. వివాదం తీవ్రస్థాయికి చేరడంతో పాడియా జానోపై గొడ్డలితో దాడి చేశాడు. తల్లి అరుపులు విని పెద్ద కూతురు (ఐదేళ్లు) నిద్ర లేచింది. తల్లి వద్దకు వచ్చిన ఆమె కూడా ఆమెను చూసి కేకలు వేయడం ప్రారంభించింది. ఇది చూసిన పాడియా తన కుమార్తెపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. తల్లి, కూతురిని హత్య చేసినా పాడియా సంతృప్తి చెందకపోవడంతో.. అవతలి గదిలో నిద్రిస్తున్న ఏడాది వయసున్న తన మరో కుమార్తెను కూడా ఇదే రీతిలో హత్య చేశాడు. తర్వాత అక్కడే పడుకున్నారు. మరోవైపు పాడియా ఇంట్లో ఏదో జరిగిందని ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మూడు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. నిందితుడు పాడియాను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం అతడి విచారణ కొనసాగుతోంది. జార్ఖండ్‌లో మద్యం మత్తులో ఇలాంటి హత్యలు జరగడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా చైన్‌పూర్ నుంచి ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇక్కడ చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కాహి మహువా టోలి గ్రామంలో, దీపక్ టిర్కీ అనే వ్యక్తి తన సొంత భార్య సరోజ్‌ను మద్యం తాగకుండా అడ్డుకున్నందుకు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య మృతి చెందింది.
*యూఏఈలో భారీ వర్షాలు.. ఒమన్‌లో 18 మంది మృతి!
ప్రస్తుతం భారతదేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తోంది. ఇందులో భాగంగా అనేక ఆంక్షలు నడుమ రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల నియమాలను గుర్తుచేస్తున్న గాని మరోవైపు రాజకీయ నాయకులు ఒక్కోసారి వాటిని అతిక్రమించి ఎలక్షన్ కమిటీ చేత నోటీసులను ఇప్పించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు కూడా ఈసీ ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది. ఇక తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఎలక్షన్ కమిటీ నోటీసులు జారీ చేసింది. న్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌కు నోటీసు ఇచ్చింది ఈసీ. ఏప్రిల్ 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 5 వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ నోటీసును జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 18 గురువారం ఉదయం 11 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
*గుజరాత్ దూకుడుని ఢిల్లీ ఆపగలదా..?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ 32వ మ్యాచ్ లో ఏప్రిల్ 17న గుజరాత్ టైటాన్స్ బుధవారం, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇక ఈ సీజన్ లో ముందుగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. 6 మ్యాచులు ఆడగా అందులో మూడు మ్యాచులలో విజయం సాధించి మూడు మ్యాచులలో ఓటమిపాలయ్యింది. ఇక చివరిగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. దీంతో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆరో మ్యాచులలో నాలుగు మ్యాచులు ఓడిపోయి కేవలం రెండు మ్యాచులలో మాత్రమే గెలుపొందింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మ్యాచ్ లో లక్నో సొంతవేదికలో ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్లో ఆడనుంది. ఇక పాయింట్స్ టేబుల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మొత్తం మూడు మ్యాచ్లు ఆడగా.. అందులో గుజరాత్ టైటాన్స్ రెండుసార్లు విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XI జట్టును చూస్తే.. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ గా ఉండవచ్చు.
ఇక గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XI జట్టును చూస్తే.. శుభమన్ గిల్ (c), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (WK), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ గా ఉండవచ్చు.
*జోస్ బట్లర్ సూపర్ సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేసి ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 107 పరుగులు చేశాడు. ఆశలు అడుగంటిన వేళ.. వీరోచిత శతకంతో కోల్‌కతాను ఒక్కడై ఓడించాడు. ఓవరాల్‌గా జోస్ బట్లర్‌కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ. దాంతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. గేల్ ఐపీఎల్‌లో 6 సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 8 శతకాలు బాదాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు గేల్‌తో సమానంగా ఉన్న బట్లర్.. ఇప్పుడు రెండో స్థానంకు దూసుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (109; 56 బంతుల్లో 13×4, 6×6) సెంచరీ బాదాడు. 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (107 నాటౌట్; 60 బంతుల్లో 9×4, 6×6) వీరోచిత శతకంతో చెలరేగాడు. గెలుపు ఆశల్లో తేలుతున్న కోల్‌కతా ఆటగాళ్లకు బట్లర్ చుక్కలు చూపిస్తూ.. రాజస్థాన్‌కు ఊహించని విజయం అందించాడు.