CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. శ్రీ రామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు. దీంతో తణుకు తేతలిలో రాత్రి బస చేశారు సీఎం జగన్. తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
Read Also: Sri Ramanavami: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేసిన జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాత్రి కూడా ఇక్కడే బస చేయనున్నట్లు తెలిసింది. సీఎం జగన్ రోజంతా శిబిరంలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి గురువారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రేపు జగన్ బస చేసిన శిబిరం నుంచి బయల్దేరి తూర్పు గోదావరి జిల్లా బయల్దేరి జగన్ వెళతారు. రేపు రావులపాలెం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రావులపాలెం జాతీయ రహదారిపై రోడ్‌షో నిర్వహించనున్నారు. కడియం మీదుగా పొట్టిలంక నుంచి బుర్రిలంక మీదుగా వేమగిరి వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. వేమగిరి నుంచి మోరంపూడి మీదుగా రాజమండ్రి సిటీలోకి రోడ్ షో రానుంది.