Lok Sabha Elections 2024, Telangana, Andhra Pradesh, AP Elections 2024, Nominations In Telugu States LIVE UPDATES, Nominations, AP Assembly Polls, Lok Sabha Polls
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జూలై కోటాకు సంబంధింది పలు సేవల టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని కూడా నేడు అరెస్ట్ చేయనున్నారు. ఈ కేసులో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదైంది.
ఏపీలో రాజీనామాలు, జంపింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పార్టీలో సీటు దక్కలేదని మరో పార్టీ గూటికి చేరుకుంటున్నారు నేతలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజురోజుకి సమీకరణాలు మారుతున్నాయి. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్.. నేడు(గురువారం) మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లన స్వీకరణ ప్రారంభం కానుంది.