రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
అమెరికాలో చేయబడిన ప్లాన్, ప్రొఫెషనల్ షూటర్ల నెట్‌వర్క్, దేశంలోని రాష్ట్రాల్లో నిల్వ చేయబడిన ఆయుధ నిల్వలు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన క్రైమ్-థ్రిల్లర్ స్టోరీని పోలి ఉంటుంది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అస్థిరత నెలకొంది. ఈ దాడి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతను పెంచింది. అటువంటి పరిస్థితిలో, ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ నౌకలో ఉన్న 17 మంది భారతీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
కంబోడియాలో ఖైమర్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి వేళ కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రగాడే.. అప్పరగా దిగిన ఫోటోలను రాయబారి కార్యాలయం ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 33 మంది ప్రాణాలు కోల్పోగా.. 27 మంది గాయపడ్డారు.
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఆయనను రాజాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు వెలమ కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వెలమ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరుపుతున్న సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఇద్దరు షూటర్లలో ఒకరు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అని పోలీసు వర్గాలు తెలిపాయి.
తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని చెన్నైలో డాక్టర్‌ను హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.