రాజస్థాన్‌లోని కోటాలో బాలుర హాస్టల్ భవనం ఆదర్శ్ రెసిడెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో కొత్త మలుపు తిరిగింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. అదే సమయంలో, హమాస్ కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను సమర్పించింది. ఇందులో ఇజ్రాయెల్ బందీల విడుదలకు షరతులు విధించారు.
కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి 'ఒక పెగ్' తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు.
సీఎం జగన్‌పై దాడి దారుణమని.. దాడిని వైఎస్‌ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. . సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
నంద్యాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ఆయన ప్రపంచ స్థాయి న్యాయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్య్రం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన సహకారం అందించాడు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురించి 10 విషయాలు తెలుసుకుందాం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నానన్నారు. సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని పేర్కొన్నారు.