Katihar Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. బూడిదైన 500 దుకాణాలు.. రోడ్డున పడ్డ వందల కుటుంబాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katihar Fire Accident: బీహార్ రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుర్సెలా లోని షహీద్ చౌక్ స్టేట్ హాట్ మార్కెట్లో జరిగిన ఈ ఘటనలో ఏకంగా 500 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారాలు క్షణాల్లో కళ్ల ఎదుటే బూడిద కావడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరయ్యారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఆదివారం సాయంత్రం 7:30 గంటల సమయంలో మార్కెట్ కొనసాగుతున్న వేళ.. ఓ బట్టల దుకాణంలో మొదలైన మంటలు వేగంగా మార్కెట్ మొత్తం వ్యాపించాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మంటలు వేగంగా పెరగడంతో ఎవరికీ స్పందించే అవకాశం కూడా లేకుండా పోయిందని తెలుస్తోంది. టిన్, గడ్డితో నిర్మించిన దుకాణాలు వరుసగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. బట్టలు, ఎలక్ట్రానిక్స్, కూరగాయలు, మొబైల్ ఇలా పలు రకాల దుకాణాలు కొద్దిసేపట్లోనే శిథిలాలుగా మారిపోయాయి.
అగ్నిజ్వాలలు అంత తీవ్రంగా ఉండటంతో సుమారు 5 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఆకాశం ఎర్రగా కనిపించింది. ఈ ఘటనతో నేషనల్ హైవే-31, స్టేట్ హైవే-77 ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనడంతో అధికారులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. సమీపంలోని పక్కా ఇళ్లలో నివసించే ప్రజలు భయంతో తమ సామాన్లను బయటకు తరలించారు. మొత్తం కుర్సెలా పరిసర ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
India vs Pakistan History: ఫిబ్రవరి 15.. అదే తేదీ, అదే చరిత్ర! మళ్లీ టీమిండియాకు టైటిల్‌పై భయం?
స్థానికుల ఆరోపణల ప్రకారం మొదట చిన్న ఫైర్ బ్రిగేడ్ వాహనం మాత్రమే సంఘటన స్థలానికి చేరుకుంది. ఆ వాహనంలోని నీరు త్వరగా అయిపోవడంతో మంటలను అదుపులోకి తేవడం కష్టమైంది. తరువాత కటిహార్ నుంచి పెద్ద అగ్నిమాపక వాహనాలు చేరుకున్నప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. గంటలపాటు చేసిన ప్రయత్నాల తరువాతే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ అగ్నిప్రమాదంలో రూ.7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా బట్టలు, కాస్మెటిక్ దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి ప్రభుత్వ సహాయాన్ని త్వరలోనే అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?